Edi ne sakshamu

    యేది నీ సాక్ష్యము

    యేది నీ సాక్ష్యము

    యేది నీ త్యాగము

    యేసు వార్తను చాటింపను

    యేల నిర్లక్ష్యము 

    లేచి రారమ్ము ఓ క్రైస్తవ

 

1. అపొస్తలులు శిష్యులు

    అపనిందలు హింసలు

    అన్నిటి భరియించిరి

    ఆత్మలు రక్షించిరి       ||యేది||


2. అగ్నికి ఆహుతియై

    అసువుల నర్పించిరి

    ఆరని నరకాగ్నికి 

    దూరంబుగా నుండిరి       ||యేది||


3. ప్రాణాలు బలిచేసిరి

    ప్రభునెంతో సేవించిరి

    సింహాలకెరయైనను

    చింతేమి లేకుండిరి       ||యేది||


4. ఆపదలు అపనిందలు

    నిర్భంధమో బంధము

    చెఱసాల సంకెళ్ళును

    నీకేమి లేదిప్పుడు             ||యేది||


5. కోతెంతో విస్తారము

    కోసెడి వారెవ్వరు

    కొంతైన చేయంగను

    కోరిక గలిగుండాలి          ||యేది||

Comments

Popular posts from this blog

Ninne Preminthunu Telugu and English Lyrics

Ninne Preminthunu Telugu and English Lyrics side by side

Yehovaa Nee Naamamu Entho Balamainadi